‘విరూపాక్ష’కు సీక్వెల్ వచ్చేస్తోంది!

by Prasanna |   ( Updated:2023-08-15 13:25:49.0  )
‘విరూపాక్ష’కు సీక్వెల్ వచ్చేస్తోంది!
X

దిశ, సినిమా: చాలా గ్యాప్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుని వరల్డ్ వైడ్ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ చేసింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసి ‘విరూపాక్ష’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు వెల్లడించారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మరి ఈ మూవీలో హీరోగా సాయి ధరమ్ తేజ్ కొనసాగుతారా? లేదా వేరే హీరోను ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సివుంది.

Read More: ఈ వారం థియేటర్, ఓటీటీ‌ల్లో చిన్న సినిమాలదే హవా!

Advertisement

Next Story