తమన్నాతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన విరాట్ కోహ్లీ?

by samatah |   ( Updated:2023-06-20 06:08:08.0  )
తమన్నాతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన విరాట్ కోహ్లీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తమన్నా‌కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక తమన్నా, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు కలిసి ఓ యాడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు ఎన్నో రూమర్స్ వస్తున్నాయి.

కాగా, తాజాగా వీరికి సంబంధించిన ఒకప్పటి యాడ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.ఇక ఆ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్స్ వెరైటీగా స్పందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఏముందంటే కోహ్లీ తమన్నా ని లవ్ లో పడేయడానికి తన ఫ్రెండ్స్ ముందు తన ఫోన్ దాచిపెట్టి తమన్న దగ్గరికి వెళ్లి నా ఫోన్ కనిపించడం లేదు మిస్డ్ కాల్ ఇవ్వరా అని చెబుతాడు. అలాగే తమన్న నెంబర్ చెప్పమంటే నెంబర్ చెబుతాడు.దాంతో ఆయన ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత ఈ నెంబర్ మీదేనా సేవ్ చేసుకుంటున్నాను పేరేంటి అని అడగగా తమన్నా అంటుంది.ఆ తర్వాత కోహ్లీ రొమాంటిక్‌గా తమన్నతో మాట్లాడతాడు. దీంతో కోహ్లీ యాడ్ అడ్డం పెట్టుకొని తమన్నాతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడంటూ కాంమెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారేమో, ఆ ప్రేమాయణం బాగ దూరమే వెళ్లినట్లు ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: సుధీర్ బాబు మూవీకి టైటిల్ ఫిక్స్

Advertisement

Next Story