Thangalaan : ప్రీరిలీజ్‌లో డిప్యూటీ సీఎంపై విక్రమ్ ఆసక్తికర కామెంట్స్..

by Hamsa |
Thangalaan : ప్రీరిలీజ్‌లో డిప్యూటీ సీఎంపై విక్రమ్ ఆసక్తికర కామెంట్స్..
X

దిశ, సినిమా: తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నీలమ్ ప్రొడక్షన్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. అయితే ఇందులో మాళవిక మెహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పశుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న గ్రాండ్‌గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు.

ఇందులో భాగంగా.. విక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇటీవల ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాడు. ‘‘పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. అతని వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు కష్టపడి, స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వడమంటే అది మామూలు విషయం కాదు. చాలా పెద్ద విషయం. అది చూసి నాకు కూడా ట్రై చేయాలని ఉంది కానీ చేయను’’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story