విజయవాడలో ‘తంగలాన్’ టీమ్.. బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేసిన విక్రమ్, మాళవిక ఫొటోలు వైరల్

by Hamsa |
విజయవాడలో ‘తంగలాన్’ టీమ్.. బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేసిన విక్రమ్, మాళవిక ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’. దీనిని పా రంజిత్ తెరకెక్కించగా.. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞనవేల్ రాజా నిర్మిస్తున్నాడు. అయితే యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తంగలాన్ నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ పాజిటివ్ రెస్పా్న్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా ఘనంగా విడుదల చేయబోతున్నారు చిత్రబృందం. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తంగలాన్ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, టీమ్ మొత్తం కలిసి విజయవాడలోని బాబాయ్ హోటల్‌లో సందడి చేశారు. హీరో విక్రమ్, మాళవిక మోహనన్, డైరెక్టర్ అక్కడ టిఫిన్ తిన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Video Link Credits to bujji5749 Instagram Channel)

Advertisement

Next Story