రౌడీ హీరోకు ఆ డైరెక్టర్ కావాలట.. ఫోన్ కోసం వెయిటింగ్

by sudharani |   ( Updated:2022-08-15 13:14:44.0  )
రౌడీ హీరోకు ఆ డైరెక్టర్ కావాలట.. ఫోన్ కోసం వెయిటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. పాన్ ఇండియా లెవల్‌లో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. దీంతో వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే విజయ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. లోకేశ్ కనగరాజ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఇటీవలే విడుదలైన సినిమా 'విక్రమ్'. "ఆ సినిమా చూస్తున్నంతా సేపు నన్ను నేను మైమరచిపోయాను. లోకేశ్ కనగరాజ్ విక్రమ్ సినిమాను అద్భుతంగా తీశారు. ఆయన సినిమాటిక్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నాకు ఎంతో ఆశగా ఉంది. త్వరలోనే ఆయన నుంచి నాకు కాల్ వస్తుందని అనుకుంటున్నాను'' అని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్‌కు లోకేశ్ కనగరాజ్ ఎప్పుడు కాల్ చేస్తారో వేచి చూడాలి మరి.. !

చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యంగ్ డైరెక్టర్‌తో సినిమా షురూ

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ అనౌన్స్‌మెంట్.. సలార్ రిలీజ్ అప్పుడే

Advertisement

Next Story