ఆ పాత్రలో నటించేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకున్నా.. విజయ్

by Prasanna |   ( Updated:2023-05-24 09:30:42.0  )
ఆ పాత్రలో నటించేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకున్నా.. విజయ్
X

దిశ, సినిమా: ‘దహద్’ సినిమాలో తను పోషించిన ఆనంద్ స్వర్ణాకర్ క్యారెక్టర్ సవాలుగా మారిందంటున్నాడు విజయ్ వర్మ. ఇటీవల విదుదలైన ఈ మూవీ పాజిటీవ్ టాక్ సొంతం చేసుకోగా మొదటిసారి ఇందులో సీరియల్ కిల్లర్‌గా నటించిన విజయ్ వర్మ తన పాత్ర గురించి ఆసక్తిర విషయాలు వెల్లడించాడు. ‘ఈ క్యారెక్టర్‌లో నటించడం నా కెరీర్‌లోనే కష్టంగా అనిపించింది. ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సైకాలజిస్ట్ సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఛాలెంజ్‌గా తీసుకుని చురుగ్గా నటించాను. ఇది ఎప్పటికీ గుర్తింపోయే సినిమా, క్యారెక్టర్. సరికొత్త అనుభవం’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

Read More: స్టార్ హీరోయిన్ రంభ కూతురు పిక్ వైరల్.. అచ్చం అమ్మలాగే

Advertisement

Next Story