- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా లవ్ స్టోరీపై బ్యాడ్ కామెంట్స్ బాధించాయి.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: విజయ్ వర్మ
దిశ, సినిమా: ప్రేమ, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే సోషల్ మీడియా నెగిటివిటీని ఎలా ఎదుర్కొంటాడో వివరించాడు విజయ్ వర్మ. రీసెంట్‌గా కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్‌లతో కలిసి ఆయన నటించిన ‘జానే జాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ మేరకు ‘కొత్తలో నెగెటివ్ కామెంట్స్ చూసి ఆందోళన చెందేవాడిని. చాలాసార్లు టాక్సిక్ ప్లేస్‌లో ఉన్నట్లు భావించాను. ముఖ్యంగా మా ప్రేమ జీవితంపై బ్యాడ్ కామెంట్లు బాధించాయి. అయితే ఈ నెగెటివిటి ఎలా పనిచేస్తుందో నేను జాగ్రత్తగా గమనించాను. ట్రోలర్స్‌కు అంత సులభంగా దొరకకుండా మన పనులకు సంబంధించిన విషయాలను సామరస్యంగా ఉంచాలని తెలుసుకున్నాను. ఎందుకంటే మన గురించి ఏ విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా రహస్యంగా ఉంచలేరు. మనమీద ప్రేమ చూపించినప్పటికీ వ్యక్తిగత విషయాలపైనే క్యూరియాసిటీ ఎక్కువ. కాబట్టి ట్రోలర్స్‌కు చిక్కకుండా ఉండటమే నా పని’ అని చెప్పాడు. అలాగే ప్రేమను ఎల్లప్పుడూ షరతులు లేని పాఠంగా అభ్యసించగలగాలని, ఒకరి మంచి, చెడు.. ఎక్కువ తక్కువలను చూపేచోట అది ఎక్కువకాలం నిలవదని తెలిపాడు. ఇక ఈ ‘Jaane Jaan’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read More: అతడు మిస్టర్ పర్ఫెక్ట్.. అలాంటి వాడు కాదు.. విజయ్‌పై సమంత వైరల్ కామెంట్స్