ఆ రోజు షారుఖ్ ప్రవర్తన చూసి షాక్ అయ్యాను: విజయ్ సేతుపతి

by Hamsa |   ( Updated:2023-08-31 10:05:24.0  )
ఆ రోజు షారుఖ్ ప్రవర్తన చూసి షాక్ అయ్యాను: విజయ్ సేతుపతి
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అటిట్యూడ్‌పై తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు కలిసి నటించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విజయ్.. రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీతోపాటు షారుఖ్, అట్లీతో తనకున్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యాడు. ‘ఫస్ట్ టైమ్ మెల్‌బోర్న్‌లో షారుఖ్‌ను కలిశా. అక్కడ ఆయన పక్కన కూర్చునే అవకాశం రావడంతో మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. ఆ రోజు ఆయన నన్ను ప్రశంసించిన సందర్భాలను ఎప్పటికీ మరిచిపోలేను. నా నటన, పనితీరును చాలా మెచ్చుకున్నారు. ఆయన మాటలకు నిజంగా నేను షాక్ అయ్యాను. ఆయన అందరినీ ఒకేలా ట్రీట్ చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా అలాంటి గొప్ప వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా లక్‌గానే భావిస్తా’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టాడు. అలాగే అట్లీ డైరెక్షన్‌లో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుందన్న విజయ్.. ఆయన మూవీని తీర్చిదిద్దే తీరు అద్భుతంగా ఉంటుందంటూ పొగిడేశాడు.

Advertisement

Next Story