అతడు మిస్టర్ పర్ఫెక్ట్.. అలాంటి వాడు కాదు.. విజయ్‌పై సమంత వైరల్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-08-26 09:26:05.0  )
అతడు మిస్టర్ పర్ఫెక్ట్..  అలాంటి వాడు కాదు.. విజయ్‌పై సమంత వైరల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్-1 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది మూవీ టీం. ఈ క్రమంలోనే.. తాజాగా కోలీవుడ్ మీడియాతో ముచ్చటించిన సమంత విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘అందరూ అనుకుంటున్నట్లుగా విజయ్ రౌటీ, రెబల్ కాదు ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. తనను చూసి రౌడీ ఫెలో అని పిలుస్తుంటారు కానీ.. వాస్తవంలో విజయ్ చాలా మంచివాడు. అతనికి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తాడు. వర్క్ పట్ల చాలా నిబద్ధతగా ఉంటాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండపై సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: ‘సలార్’ ట్రైలర్ అప్‌డేట్‌పై సాలిడ్ బజ్

Advertisement

Next Story