‘ఫ్యామిలీ స్టార్’ పై ఇన్‌ట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్.. ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2024-03-01 11:17:24.0  )
‘ఫ్యామిలీ స్టార్’ పై ఇన్‌ట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ లవర్ బాయ్ విజయ్ దేవరకొండ, తెలుగింటి సీతమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దివ్యాన్ష కౌశిక్, అజయ్ ఘోస్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లతో పాటు ఫస్ట్ సింగిల్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చాడు విజయ్. ఈ మేరకు తన X ఖాతాలో ‘టీజర్ వస్తుంది’ అని తెలుగు, తమిళ భాషలో పోస్ట్ చేశాడు. అయితే ఎప్పుడు వస్తుంది..? ఏంటీ అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘టీజర్’ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

Read More..

బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ పండగ నాడే స్ట్రీమింగ్



Advertisement

Next Story