టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ట్రోలర్స్‌కి విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రిప్లై!

by sudharani |
టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ట్రోలర్స్‌కి విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రిప్లై!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్‌గా ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. విజయ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఈ విషయం పక్కన పెడితే.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు విజయ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’లో అర్జునుడిగా నటించాడు. ఈ పాత్ర విషయంలో విజయ్‌పై నెట్టింట ప్రశంసలతో పాటు ట్రోల్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి.

అయితే.. ఈ ట్రోల్స్‌కు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా మాస్ రిప్లై ఇచ్చాడు విజయ్. అర్జునుడి పాత్రలో విజయ్‌ను చూసి కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ రిప్లైగా అదే లెక్ తన సోషల్ మీడియాల అకౌంట్స్‌కు డీపీగా పెట్టుకున్నాడు. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్న నాకు నో ప్రాబ్లెం అన్నట్లుగా విజయ్ డీపీ ఛేంజ్ చెయ్యడంతో.. ట్రోలర్స్ సైలెంట్ అయ్యారు. ఇక విజయ్ అభిమానులు మాత్రం.. ఈ చిత్రంతో అన్నపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది.. సూపర్ హిట్ అందుకుంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed