ఓవర్ నైట్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఎవరితోనో తెలుసా? ఫొటో వైరల్

by Hamsa |   ( Updated:2023-10-01 06:12:08.0  )
ఓవర్ నైట్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఎవరితోనో తెలుసా? ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు పరిచయం అవసరం లేదు. లైగర్ భారీ డిజాస్టర్ తర్వాత మళ్లీ ఇటీవల ‘ఖుషి’ సినిమాతో హిట్ అందుకున్నాడు. కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది ‘ఖుషి’. అంతేకాకుండా ఈ మూవీ థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలో కూడా దూపుకుపోతుంది. ప్రస్తుతం రౌడీ హీరో, మృణాల్ ఠాకూర్‌తో ‘VD13’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. తాజాగా, విజయ్ వీకెండ్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. అందులో ఆనంద్ దేవరకొండ తో పాటు ఇద్దరు విజయ్ ఫ్రెండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గోవాలో ఓవర్ నైట్ పార్టీలో బీర్ ఉన్న గ్లాస్ పట్టుకుని కనిపించారు.




Advertisement

Next Story