స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ.. మరో రెండు సినిమాలు అనౌన్స్‌మెంట్..!

by sudharani |   ( Updated:2023-09-26 08:54:49.0  )
స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ.. మరో రెండు సినిమాలు అనౌన్స్‌మెంట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ‘ఖుషి’ సినిమా హిట్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్‌లో మాత్రం యావరేజ్ అనిపించుకుంది. గత ఐదు ఏళ్లుగా హిట్ లేనప్పటికి ఈ హీరోకి అవకాశాలు మాత్రం దండిగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే కెరీర్ స్పీడ్ పెంచే పనిలో ఉన్నాడు విజయ్. ఇప్పటికే గౌతమ్ తిన్నునూరి డైరెక్షన్‌లో VD 12 సినిమా చేస్తుండగా.. గీత గోవిందం వంటి హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ పరశురామ్ పెట్ల డైరెక్షనల్‌లో కూడా ఓ మూవీ చేస్తున్నాడు.

ఇక ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానో.. మరో రెండు మూవీస్‌కు ఒకే చెప్పాడట మన రౌడీ హీరో. టాక్సీవాలా కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. డైరెక్టర్ రాహుల్ సంకీర్తన్‌లో ఓ సినిమా చేయనున్నారట. ఇక దిల్ రాజు బ్యానర్‌లో కూడా మరో మూవీ చేయనున్నారట. ఈ రెండు సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలతోనైనా విజయ్ దేవరకొండ హిట్ కొడతాడేమో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story