తనతో ఫొటో దిగడానికి వచ్చిన వ్యక్తిని కొట్టబోయిన విజయ్ దేవరకొండ.. (వీడియో)

by sudharani |   ( Updated:2024-04-01 08:27:35.0  )
తనతో ఫొటో దిగడానికి వచ్చిన వ్యక్తిని కొట్టబోయిన విజయ్ దేవరకొండ.. (వీడియో)
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. మన రౌడీ హీరోకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో చాలా మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఓ అభిమాని చేసిన పనికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విజయ్. అసలు ఏం జరిగిందంటే..

ఓ అభిమాని విజయ్ దేవరకొండ ఫొటోను గీసి ఫ్రేమ్ కట్టించి రౌడీ హీరోకు చూపించాడు. అది మామూలు పెయింటింగ్ అనుకున్న విజయ్.. అతడితో నార్మల్‌గా ఫొటో దిగి పంపంచబోయాడు. కానీ ఇంతలో ఆ ఫొటో అభిమాని తన రక్తంతో గీసిన పెయింటింగ్ అని తెలుసుకున్న విజయ్.. తన అభిమానికి వెనక్కి పిలిచి మరి.. అరేమ్ మెంటల్ ఇలాంటి పనులు చెయ్యకూడదు అంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

ముగ్గురు కూతుర్లతో భారమైన జీవితం.. స్టార్ హీరో సాయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ (వీడియో)

Advertisement

Next Story