ఎట్టకేలకు లైఫ్ పార్ట్‌నర్ గురించి చెప్పేసిన Vijay Deverakonda.. పెళ్లి కూడా అప్పుడేనంటూ

by Prasanna |   ( Updated:2023-08-31 08:23:18.0  )
ఎట్టకేలకు లైఫ్ పార్ట్‌నర్ గురించి చెప్పేసిన Vijay Deverakonda.. పెళ్లి కూడా అప్పుడేనంటూ
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘ఖుషి’ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్న ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో కెరీర్ అండ్ పర్సనల్ విషయాలపై మాట్లాడాడు. ‘నిజానికి నేను నటుడిని కావడానికి మహేష్ బాబు పోకిరి సినిమానే కారణం. ఇంట్రడక్షన్ సీన్ చూసి ఫిక్స్ అయ్యాను. అలాగే నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. యవ్వనం అయిపోయాక ఆ కల నేరవేర్చుకుంటా. మరికొన్ని డ్రీమ్స్ ఉన్నాయి త్వరలో వెల్లడిస్తా. ఇక పరాయజం అందరికి ఎదురవుతుంది. దాని నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నేనూ అదే చేస్తున్నా’ అన్నాడు. అలాగే ‘లైఫ్ పార్ట్‌నర్ ఇంటిలిజెంట్ అయివుండాలి. నేను ఇష్టపడే వాటిని తాను ఇష్టపడాలి. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చాలా సింపుల్‌గా చేసుకుంటా. ఎవరకీ చెప్పను. డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. మనసుకు నచ్చితే చేయడమే. నేను ఎవరినీ ఇన్స్ పిరేషన్‌గా తీసుకోను. కేవలం డబ్బు, గౌరవం కావాలనుకుంటా’ అని డైరెక్టుగా చెప్పేశాడు విజయ్. చివరగా సమంత ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ మూవీకోసం కష్టపడిందన్న హీరో.. సందీప్ రెడ్డీతో మరో ప్రాజెక్టు త్వరలోనే చేస్తానని తెలిపాడు.

Read More: ‘సెక్స్ ఎడ్యుకేషన్’ నుంచి బిగ్ అప్‌డేట్.. పోస్టర్ చూస్తే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేరు

Advertisement

Next Story