విజయ్ దేవరకొండ, అలియా భట్ కలయికలో రానున్న బిగ్ ప్రాజెక్ట్?

by Anjali |   ( Updated:2023-09-28 07:49:19.0  )
విజయ్ దేవరకొండ, అలియా భట్ కలయికలో రానున్న బిగ్ ప్రాజెక్ట్?
X

దిశ, సినిమా: ‘ఖుషి’ మూవీతో మంచి విజయం అందుకున్న హీరో విజయ్ దేవరకొండ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రజంట్ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇందులో దర్శకుడు పరశురామ్‌తో #VD13 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు ఇంకా రెండు మూడు చిత్రాలు లైన్‌లో పెట్టాడు విజయ్. ఇదిలావుంటే.. తాజా సమాచారం ప్రకారం విజయ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఇందులో విజయ్‌ సరసన అలియా భట్ నటించనున్నట్లు టాక్. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.


Advertisement

Next Story