మూడు రోజుల్లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాకు కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-09-04 08:02:02.0  )
మూడు రోజుల్లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాకు కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1వ తేదీన విడుదలై భారీ విజయం సాధించింది. హిట్ టాక్ తో దూసుకుపోతూ మంచి కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది. ఇక రెండు రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసిన ఖుషి సినిమా తాజాగా, మూడు రోజుల్లో 70 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ పోస్టును చూసిన ప్రేక్షకులు 100 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.

Read More: సమంతను అనకూడని మాట అనేశారుగా !.. కిస్సింగ్స్, బెడ్ సీన్స్ అవసరమా అంటూ..?

Advertisement

Next Story