నా బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అవ్వదు.. అంటూ సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ..

by sudharani |   ( Updated:2023-10-05 12:58:16.0  )
నా బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అవ్వదు.. అంటూ సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ..
X

దిశ, సినిమా: ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ‘ఫిదా’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తున్న ఈ నేచురల్ బ్యూటీతో జతకట్టేందుకు ఎలాంటి హీరో అయినా ఓకే అనాల్సిందే. కానీ తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం సాయి పల్లవిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

విషయం ఏంటంటే విజయ్ తదుపరి చిత్రం పరశురాం దర్శకత్వంలో రాబోతుంది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ నటిస్తోంది. కానీ ముందు హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నారట. అయితే విజయ్.. ‘నా బాడీ లాంగ్వేజ్‌కు ఆమెకు, ఈ స్టోరీకి అసలు మ్యాచ్ కాదు. వద్దంటే వద్దు’ అని చెప్పేశాడట. దీంతో చేసేది లేక మృణాల్‌ని తీసుకున్నారట. ప్రజంట్ ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story