అంచనాలకు మించి ఉండనున్న విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలు!

by Anjali |   ( Updated:2023-09-05 06:51:39.0  )
అంచనాలకు మించి ఉండనున్న విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. విజయ్ ఇప్పటివరకు కలిసి తీసిన ‘‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’’ సినిమాలు ఊహించని రేంజ్‌లో భారీ సక్సెస్‌ను అందుకున్నాయి. తాజాగా.. విజయ్ ఖాతాలో మరో హిట్ పడింది. ఖుషి మూవీ కేవలం 3 రోజుల్లోనే రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంతో విజయ్‌కు ఇకనుంచి తిరుగులేదంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. విజయ్ ఇప్పటినుంచి లవ్ స్టోరీస్ మూవీస్ తీయబోరంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రేడీ ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ టైటిల్ ఖరారు కానీ ఓ సినిమా చేస్తున్నారని తెలిసిందే. ఈ మూవీ పెద్ద హిట్టే కొడుతోంది టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌కు సంబంధించిన సినిమా. ఈ చితరంపై విజయ్ దేవరకొండ అభిమనులు భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Read More: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్‌లో కనిపించని అనుష్క.. రీజన్ వెల్లడించిన నవీన్ పోలిశెట్టి

Advertisement

Next Story