Vijay Deverakonda : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ!

by sudharani |   ( Updated:2023-09-16 12:32:55.0  )
Vijay Deverakonda : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ!
X

దిశ, సినిమా: తాజాగా ‘ఖుషి’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ అందుకోనప్పటికి ఓవర్సీస్‌లో, తమిళనాడులో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా రూ.40 కోట్ల షేర్ మార్క్ దాటేసింది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో విజయ్ మాట్లాడుతూ.. ‘నాపై ఇంత మంచి ప్రేమ చూపించినందుకు ఒక్కో కుటుంబానికి ఒక లక్ష చొప్పున మొత్తం ఒక కోటి రూపాయలు నా రెమ్యునరేషన్ నుంచి 100 కుటుంబాలకు అందిస్తాను’ అని మాటిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్. మొత్తం 100 కుటుంబాలకు సంబంధించిన లిస్ట్ ఎంపిక చేసి పోస్ట్ చేశాడు. ‘ఇది మీ కుటుంబాలకి ఆనందం కలిగిస్తుంది అనుకుంటున్నా’ అని తెలిపాడు.

Advertisement

Next Story