టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ టాప్.. వెనకబడ్డ అగ్రహీరోలు.. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి

by sudharani |   ( Updated:2023-09-26 14:23:19.0  )
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ టాప్.. వెనకబడ్డ అగ్రహీరోలు.. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: నటీనటులు వెండితెరపై సినిమాలు చేయడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. నెట్టింట వాళ్లుకున్న ఫాలోవర్స్ బట్టి మన నటీనటుల క్రేజ్ ఏంటి అనేది ఓ అంచనాకు రావొచ్చు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఒకటైన వాట్సాప్‌లో నూతనంగా ఓ కొత్త ఫిచర్ వచ్చిన విషయం తెలిసిందే. అదే వాట్సాప్ చానల్. ప్రస్తుతం ఇందులో కూడా మన నటులు పోటీ పడుతున్నారు. ఈ పోటీలో బాలీవుడ్, మాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ హీరోలు ఉన్నారు. టాలీవుడ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ 1.1 మినియన్ల ఫాలోవర్స్‌తో టాప్‌లో ఉన్నారు. నాలుగు రోజుల్లోనే ఈ రౌడీ హీరోకు లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇక మలయాళంలో మోహన్ లాల్ 1.2 మిలియన్ ఫాలోవర్స్‌తో అగ్రస్థానంలో ఉండగా ముమ్ముట్టి 1mతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. కాగా.. చాలా మంది సెలబ్రెటీలు ఇంకా వాట్సాప్ చానెల్‌ను యూస్ చేయడం లేదు. వాళ్లు కూడా ఎంట్రీ ఇస్తే పోటీపోటీగా ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంది.

More News : డేటింగ్‌లో మునిగి తేలుతున్న టాలీవుడ్‌ స్టార్ కపుల్స్ వీళ్లే.. మరి పెళ్లి పీటలు ఎక్కుతారా..?

Advertisement

Next Story