ప్రభాస్ ‘స్పిరిట్’లో విజయ్ దేవరకొండ!?

by Anjali |   ( Updated:2023-09-19 07:28:22.0  )
ప్రభాస్ ‘స్పిరిట్’లో విజయ్ దేవరకొండ!?
X

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ‘స్పిరిట్’లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే పవర్ ఫుల్ పోలీస్‌కు ధీటుగా పవర్ ఫుల్ విలన్ కూడా ఉండటం అనవాయితీ. ఇందులో భాగంగానే ఈ మూవీలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను రంగంలోకి దింపబోతున్నాడట సందీప్. దీనికి ప్రభాస్ కూడా ఒకే చెప్పాడని, విజయ్ సైతం ఆ రోల్ చేయడానికి వెంటనే అంగీకరించినట్లు సమాచారం. అదే నిజమైతే తెరపై ప్రభాస్-విజయ్‌ల పోరు రసవత్తరమే.

Advertisement

Next Story