మరోసారి పెద్ద మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. అడ్రస్ కనుక్కుని మరి సహాయం..

by sudharani |   ( Updated:2023-10-31 13:01:15.0  )
మరోసారి పెద్ద మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. అడ్రస్ కనుక్కుని మరి సహాయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఖుషి’ సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. వరుసగా కుటుంబ నేపథ్యంలో సినిమాలు విజయ్ ఎంచుకుంటుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రొటీన్ లవ్ స్టోరీస్, రొమాన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుండటంతో శభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సినిమాలతో సంబంధం లేకుండా విజయ్ పలువురికి హెల్ప్ చేస్తుంటాడు. తాజాగా మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోటబొమ్మాలి ప్రాంతంలో ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకుంది. ఈ విషయం విజయ్ దేవరకొండ దృష్టికి వచ్చింది. దీంతో ఈ పాప ఎవరు..? ఎక్కడ ఉంటుంది..? అని ఆమె అడ్రస్ కనుక్కుని మరి ఆ చిన్నారి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెతున్నాయి.



Advertisement

Next Story