లైగర్ ఈవెంట్‌కు ఆటోలో వచ్చిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్

by sudharani |   ( Updated:2023-08-18 15:47:03.0  )
లైగర్ ఈవెంట్‌కు ఆటోలో వచ్చిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్
X

దిశ,సినిమా: రౌడీ స్టార్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'లైగ‌ర్'. ఈ నెల 25న విడుద‌ల కానున్న సినిమా నుంచి ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్‌లో విజ‌య్ తన మాస్ మేకోవ‌ర్‌తో ప్రేక్షకుల‌ను ఫిదా చేసిన సంగతి తెలిసిందే. ఇక చిత్రబృందం వ‌రుస ప్రమోష‌న్స్‌తో బిజీగా ఉండగా.. ఇందుకు సంబంధించిన ప్రతీ ఈవెంట్‌లో విజయ్ రూ. 199/- చప్పల్స్ ధరించడం కూడా ట్రెండ్ అయింది. ఇదే క్రమంలో రీసెంట్‌గా ముంబైలో ఓ డాన్స్ రియాలిటీ షో సెట్స్‌కు విచ్చేసిన రౌడీ హీరో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తను ఆటోలో రావడమే ఇందుకు కారణం కాగా వైట్ షర్ట్‌లో చాలా ఇన్నోసెంట్‌గా కనిపించిన విజయ్ మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నాడు.

Advertisement

Next Story