'లైగర్' సక్సెస్ కోసం పూజలో పాల్గొన్న హీరో హీరోయిన్లు

by sudharani |   ( Updated:2022-08-17 13:26:23.0  )
లైగర్ సక్సెస్ కోసం పూజలో పాల్గొన్న హీరో హీరోయిన్లు
X

దిశ, సినిమా : పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్' ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ సినిమాపై క్రేజ్ అమాంతం రెట్టింపవుతుండగా.. మరోవైపు ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది లైగర్ టీమ్. ఇప్పటికే పలు నగరాలను చుట్టేసిన మూవీ యూనిట్.. మరికొన్ని చోట్ల ఈవెంట్స్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన కొడుకు సురక్షితంగా ఉండాలని పూజలు చేసింది హీరో విజయ్ దేవరకొండ తల్లి. సినిమా మంచి విజయం సాధించాలని పురోహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే విజయ్, హీరోయిన్ అనన్య పాండేతో ప్రత్యేక పూజలు చేయించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనన్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా.. ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక నుండి వాటికి దూరంగా ఉంటా : సమంత

Advertisement

Next Story