వెంకటేష్ 75వ చిత్రం నుంచి బిగ్ అప్ డేట్..!

by Hajipasha |   ( Updated:2023-01-11 14:21:02.0  )
వెంకటేష్ 75వ చిత్రం నుంచి బిగ్ అప్ డేట్..!
X

దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ.. వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆయన 75వ మూవీ ల్యాండ్ మార్క్ సినిమాగా రాబోతుంది. ఇంతకీ ఈ చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నాడా అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే 'హిట్' మూవీతో ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ తన 75వ సినిమా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే మరో తాజా వార్త ఏమిటంటే.. ఈ సినిమాలో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story