భార్యలతో అలా ఉండకపోతే సంసారం కూలిపోతుంది.. బాలీవుడ్ హీరో

by Dishaweb |   ( Updated:2023-06-27 10:42:17.0  )
భార్యలతో అలా ఉండకపోతే సంసారం కూలిపోతుంది.. బాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా: నటి-భార్య కత్రినా కైఫ్‌తో తన వైవాహిక జీవితం గురించి మరోసారి ఆసక్తికరంగా మాట్లాడాడు విక్కీ కౌశల్. ఏదైనా వివాహ బంధం సజావుగా సాగాలంటే భాగస్వాములిద్దరికీ సహనం తప్పనిసరి ఉండాలని, అలా కాకుండా ఇద్దరికీ ఇగోలుంటే ఆ రిలేషన్‌ను ఎక్కవకాలం చూడలేమన్నాడు. అలాగే తాను ఏ క్షణంలోనైనా ఉత్తమమైన భర్తగానే ఉండటానికి ప్రయత్నిస్తానన్న హీరో.. ఆ వెర్షన్‌కు సంబంధించిన విషయాలు తప్పా మరేమీ తన మనసులోని రానివ్వనని తెలిపాడు. ‘నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తున్నా. కానీ, ఇతర పురుషుల వలే భార్యలను లోబరుచుకోవాలని అనుకోవట్లేదు. నేను ఆమెకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలనుకుంటాను’ అంటూ భార్యభర్తల బంధం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు.

Read More..

బిగ్‌బాస్ షోలో ఘోరం.. చుట్టూ కెమెరాలు ఉన్నా అసభ్యంగా ప్రవర్తించిన కంటెస్టెంట్

ఇతరులు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా?.. ఇవి కారణం అయ్యుండవచ్చు!

Advertisement

Next Story