Katrina Kaif రియల్ క్యారెక్టర్‌పై Vicky Koushal షాకింగ్ కామెంట్స్.. మొదట్లో భయమేసిందంటూ

by sudharani |   ( Updated:2023-09-15 16:16:15.0  )
Katrina Kaif రియల్ క్యారెక్టర్‌పై Vicky Koushal షాకింగ్ కామెంట్స్.. మొదట్లో భయమేసిందంటూ
X

దిశ, సినిమా : స్టార్ నటి కత్రినా కైఫ్‌తో ప్రేమ, పెళ్లి గురించి నటుడు విక్కీ కౌశల్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలం డేగింగ్ తర్వాత మ్యారేజ్ చేసుకున్న ఈ జోడి ఒకరిపట్ల ఒకరు ఎల్లప్పుడూ అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తూ అభిమానులను ఫిదా చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ.. ‘కత్రిన నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. తన రాకతో నా జీవితం పరిపూర్ణమైంది. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ హోదా చూసి ప్రేమించలేదు.

కత్రిన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇష్టపడ్డాను. ఆమె సన్నిహితుల దగ్గర తన రియాలిటీ గురించి విని ఆశ్చర్యపోయా. కానీ ఆమెను గెలుచుకోవడం కష్టమని తెలిసి భయపడ్డాను. ఆ తర్వాత ఆమె నా గురించి ఓ కార్యక్రమంలో మాట్లడటం, కొంతకాలానికి మా మధ్య క్లోజ్ రిలేషన్ ఏర్పడటం జరిగిపోయింది. మా ప్రేమ విషయం ఫ్యామిలీతో చెప్పగానే పాజిటీవ్‌గా స్పందించారు’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా క్రతిన ప్రతి విషయంలో తనను గైడ్ చేస్తుందని, పిల్లల గురించి కూడా తమకు ఎలాంటి ఆందోళన లేదన్న హీరో ఇప్పట్లో ఆ ఆలోచన లేదని స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి : సురేఖ చేసే పనులపై శ్రీజ అసహనం.. అంత తప్పు ఏం చేసిందంటే! పోస్ట్ వైరల్

Advertisement

Next Story