‘యానిమల్‌’ మూవీ సీక్వెల్‌లో మరో బాలీవుడ్ స్టార్ హీరో..!

by Kavitha |
‘యానిమల్‌’ మూవీ సీక్వెల్‌లో మరో బాలీవుడ్ స్టార్ హీరో..!
X

దిశ, సినిమా: ప్రజంట్ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘బాహుబలి’ 1,2.. ఆ తర్వాత ‘కెజిఫ్’ చాప్టర్ 1,2.. ఇలా ఎన్నో హిట్ చిత్రాల సిక్వెల్స్ థియేటర్లలో సందడి చేశాయి. ఇక గత ఏడాది చివరిలో భారీ హిట్‌ను సాధించి బాక్స్ ఆఫీస్‌ను కొల్లగొట్టిన చిత్రాలు.. అప్పుడే సిక్వెల్స్ కు రెడీ అయిపోతున్నాయి. అందులో ‘యానిమల్’ మూవీ ఒకటి. 2023 డిసెంబర్ 1న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ రకంగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. దీంతో రాబోయే ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

అయితె ఈ మూవీలో బాబీదేవోల్‌ పాత్ర ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో మనకు తెలిసిందే. కాగా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ క్రేజీ సీక్వెల్ లో బాబీదేవోల్‌ పాత్రలో విక్కీ కౌశల్‌ను విలన్‌గా నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ..ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం సందీప్‌ ప్రభాస్‌ తో ‘స్పిరిట్‌’ మూవీ రూపొందించే పనిలో ఉన్నారు.

Advertisement

Next Story