Katrina Kaif బర్త్ డే.. బీచ్‌లో సరికొత్తగా సెలబ్రేట్ చేసిన విక్కీ

by Prasanna |   ( Updated:2023-07-17 09:42:02.0  )
Katrina Kaif  బర్త్ డే.. బీచ్‌లో సరికొత్తగా సెలబ్రేట్ చేసిన విక్కీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి, భార్య కత్రినా కైఫ్‌కు బర్త్ డే సందర్భంగా ఓ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేశాడు విక్కీ కౌశల్. ఈ యేడాదితో తన సతీమణికి 40ఏళ్లు నిండినట్లు తెలుపుతూ ఆమెతో కలిసి సముద్రం అందాలను ఆస్వాదిస్తున్న ఆయన.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తనదైన స్టైల్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఇన్ అవే ఆఫ్ యువర్ మ్యాజిక్.. ఎవ్రీడే.. హ్యాపీ బర్త్ డే మై లవ్’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై స్పందించిన భూమి పెడ్నేకర్, సన్నీ కౌశల్, జోయా అక్తర్, రాశి ఖన్నాలతోపాటు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున కత్రినకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more : రంభ తొడలు చూడటానికే అక్కడికి వెళ్లాం.. ఆ రాత్రి కూడా అబ్బా ఏముందిరా అనుకున్నాం: ఉత్తేజ్

Advertisement

Next Story