కేసీఆర్ తప్పకుండా జైలుకెళ్తాడు.. ఎలా ఎప్పుడు అవుతారో బాంబ్ పేల్చిన వేణుస్వామి?

by Anjali |   ( Updated:2024-03-20 08:27:33.0  )
కేసీఆర్ తప్పకుండా జైలుకెళ్తాడు.. ఎలా ఎప్పుడు అవుతారో బాంబ్ పేల్చిన వేణుస్వామి?
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తరచూ సినీ సెలబ్రిటీలపై, ప్రముఖ రాజకీయ నాయకులపై జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తాడు. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత-నాగచైతన్య పెళ్లాయ్యాక డివోర్స్ తీసుకుంటారని చెప్పాడు. ఇది కాస్త నిజం కావడంతో.. అప్పటి నుంచి వేణుస్వామి ఏం చెప్పిన సెలబ్రిటీలు.. ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతారు.

అయితే గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతారని అన్నారు. వేణు స్వామి చెప్పినట్లుగానే ఇటీవల కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కవితక్క ను అరెస్టు చేసి.. ఢిల్లీకి తరలించారు. అలాగే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ జైలు జీవితం గడపాల్సి వస్తుందని ఉంటుందని అన్నారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో వేణుస్వామికి కేసీఆర్ పై ఓ ప్రశ్న ఎదురైంది. కేసీఆర్ ఇప్పటివరకు క్లీన్ రాజకీయాలు చేశారు కదా ఎలా అరెస్ట్ అవుతారు ఏవిధంగా అరెస్టు అవుతారని యాంకర్ అడగ్గా..

‘‘ఎలా ఏంటి అనేది నేను చెప్పలేను కానీ కేసీఆర్ తప్పకుండా జైలుకు వెళ్తాడు. కాస్త ఆలస్యమైన కేసీఆర్ జైలు జీవితం గడపక తప్పదు’’. అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చాడు. సినీ సెలబ్రిటీలపైన, రాజకీయ నాయకులపైన ఇప్పటివరకు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. మరీ కేసీఆర్ నిజంగానే జైలుకు వెళ్తాడా? వెళ్లే పరిస్థితులు వస్తాయా? అంటూ నెట్టింట పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More..

మహేష్ బాబుకు అంత సీన్ లేదంటూ బాంబు పేల్చిన వేణు స్వామి.. చంపేస్తాం అంటూ ఫ్యాన్స్ వార్నింగ్..!

Advertisement

Next Story