విరాట్ కోహ్లీ భార్యపై అసభ్యకర కామెంట్స్ చేసిన వేణుస్వామి.. ఆమె అలాంటిది కాబట్టే!

by Anjali |   ( Updated:2024-03-22 02:14:35.0  )
విరాట్ కోహ్లీ భార్యపై అసభ్యకర కామెంట్స్ చేసిన వేణుస్వామి.. ఆమె అలాంటిది కాబట్టే!
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా ఈయనను విమర్శించే జ్యోతిష్యులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు ఉదాహరణగా.. స్టార్ క్రికెటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లను వాడాడు. రోహిత్ ప్రదర్శన గురించి.. కోహ్లీ భార్య గురించి కామెంట్స్ చేశాడు. అనుష్క లాంటి అందమైన వైఫ్ ఉంది కాబట్టే విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు అంటే ఎలా? అని ప్రశ్నించాడు. వేణుస్వామిని తిట్టే హక్కు ఏ జ్యోతిష్యుడికి లేదని గట్టిగా చెప్పాడు.

వేణుస్వామి చెప్పిన జాతకాల్లో నక్షత్రం తప్పు, జ్యోతిష్యం తప్పు ఏమైనా ఉంటే.. వాటిని ఎత్తి చూపి తిట్టిండి.. విమర్శించండి అని తెలిపాడు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జ్యోతిష్యుడు తరచూ రాజకీయ నాయకులపై, ప్రముఖ సినీ సెలబ్రిటీల పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్రికెటర్ల వంతు వచ్చిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం మానుకో అంటూ కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇకపోతే వేణు స్వామి తరచూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటాడు. కాగా రీసెంట్ గా వేణు స్వామి జోస్యం పై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న వేణు స్వామి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా దారుణమైన విమర్శలు చేశాడు. కవితక్క జైలుకి వెళ్లింది. కాస్త ఆలస్యమైన కేసీఆర్ కూడా తప్పకుండా జైలు శిక్ష అనుభవిస్తాడని చెప్పుకొచ్చాడు.

Read More..

మహేష్ బాబుకు అంత సీన్ లేదంటూ బాంబు పేల్చిన వేణు స్వామి.. చంపేస్తాం అంటూ ఫ్యాన్స్ వార్నింగ్..!

Advertisement

Next Story