- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాన్స్ భయపడే ఆధారాలతో మరోసారి ప్రభాస్ జాతకం బయటపెట్టిన వేణుస్వామి
దిశ, సినిమా: రెబల్ ప్రభాస్ ప్రభాస్ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. రీసెంట్‌గా తెరకెక్కిన ‘సలార్’ చిత్రంతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నప్పటికీ రెబల్ స్టార్ జాతకం అస్సలు బాగోలేదని గత ఏడాది నుంచి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెబుతున్న విషయం తెలిసిందే.
దీంతో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో, రాధే శ్యామ్ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. గతంలో ప్రభాస్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడతాడని చెప్పాడు. నిజంగానే ఈ హీరో ఓ కార్యక్రమంలో చేతి నొప్పితో బాధపడుతోన్నట్లు ఫొటోలు చూస్తే అర్థమైంది. తాజాగా వేణుస్వామి రెబల్ స్టార్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో వేణుస్వామి పలు ఆధారాలను చూపుతూ ప్రభాస్ జాతకం బయటపెట్టాడు.
ప్రతి ఒక్కరూ నా పాత వీడియోలు చూడండి. ఆదిపురుష్ ఫ్లాప్ అని చెప్పానా? అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సలార్ సినిమా ప్రభాస్ అభిమానులు తప్ప ఎవరూ చూడరన్నాను. ఈ మూవీ విషయంలో కూడా అలాగే జరిగింది. ఈయన సినిమాల విషయంలో నేను చెప్పినట్లే జరిగింది. మన దేశంలోనే నాలాంటి మగాడు లేడు. ఇప్పుడు కూడా చెబుతున్నాను. ప్రభాస్ జాతకం అస్సలు బాగోలేదు’’ అంటూ వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.