- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya-Sobhita:నాగచైతన్య-శోభిత విడిపోతారంటూ కామెంట్స్ చేసిన వేణు స్వామి అరెస్ట్.. క్లారిటీ ఇదే! (వీడియో)
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న ఆయన ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకున్న నాగచైతన్య, శోభిత జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి జాతకాలు బాలేవని 2027లో ఓ స్త్రీ వల్ల విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశారు. అంతేకాకుండా సమంత జాతకం బాగుంది కానీ అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత పెద్ద మంచిగ లేదని అన్నారు. దీంతో వేణు స్వామి కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారం రేపాయి.
దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయి ట్రోల్ కూడా చేశారు. ఇక మహిళా కమిషన్ మాత్రం ఏకంగా వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా నోటీసులు కూడా పంపారు. ఇక దీనిపై జ్యోతిష్యుడి భార్య కూడా రియాక్ట్ అయింది. ఇదిలా ఉంటే.. వేణు స్వామి, చైతు-శోభితలపై నెగిటివ్ కామెంట్స్ చేసినందుకు ఆయనను అరెస్ట్ చేసినట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, వేణు స్వామి ఆ వార్తలపై రియాక్ట్ అవుతూ ఇన్‌స్టా వేదికగా వీడియోను విడుదల చేశాడు. ‘‘ఏదో చానల్స్‌లో వేణుస్వామి అరెస్ట్ అయ్యారని ఏవేవో వార్తలు వస్తున్నాయి.
తెలుసు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో.. ఎందుకు చేస్తున్నారో కూడా అర్థమైంది. నేను చాలా విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ కేసులు అంటే.. ఓ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్నారు. అయితే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఎలా ఆడుకున్నారో కూడా చూశాను. నేను జాతకాలు చెబితే అరెస్ట్‌లు ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నా పనిలో నేను బిజీగా ఉన్నాను. నా ఆఫీసులో పనులు జరుగుతున్నాయి. అయితే ఒక నెల గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడుకుందాం. అయినా సెలబ్రిటీ జాతకాలు చెప్పడం మానేశాను. కానీ కొంతమంది రివ్యూలు చెప్పే వారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ వేణు స్వామి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
(Video Link Credits to parankusham venuswamy Instagram Channel)