చిరు 'వాల్తేరు వీరయ్య' మూవీలో వెంకీ, నాగ్.. పక్కా మాస్ ఎంటర్‌టైనర్

by sudharani |   ( Updated:2022-09-23 07:35:16.0  )
చిరు వాల్తేరు వీరయ్య మూవీలో వెంకీ, నాగ్.. పక్కా మాస్ ఎంటర్‌టైనర్
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మూవీ 'వాల్తేరు వీరయ్య'. చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ఈ సినిమాలో ఆయన సోదరుడిగా మాస్ మహారాజా రవితేజ కనిపించనున్నాడు. ఇక అసలు విషయానికొస్తే.. చిరు, వెంకటేష్, నాగార్జున, బాలయ్య టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల వంటి వారని తెలిసిందే. కానీ ఇప్పటి వరకు వీరిలో ఏ ఇద్దరు కూడా ఒకే చిత్రంలో కలిసి నటించలేదు.

అయితే 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో వెంకటేష్ కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తుండగా.. ఇందుకు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అక్కినేని నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతున్నారనే రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఆయన పలు రొమాంటిక్‌ సన్నివేశాల్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదే గనుక నిజమైతే తెలుగు ప్రేక్షకులకు మంచి మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ.

Advertisement

Next Story

Most Viewed