‘#VD18’ బిగ్ అప్‌డేట్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2024-02-04 15:43:47.0  )
‘#VD18’ బిగ్ అప్‌డేట్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ‘నేను శైలజ’ మూవీస్‌తో తెలుగు తెరకు పరిచమైన కీర్తి సురేష్.. అలనాటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో నటించి ఎంతో మంది హృదయాలను దోచుకుంది. ఇక ఇటీవల చిరంజీవి ‘భోళ శంకర్’ చిత్రంతో ఆకట్టుకున్న కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ చిత్రం ఒకటి.

కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ‘#VD18’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ పనులు జరుగుతున్న ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది కీర్తి. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో ‘‘#VD18’ బిగ్ అప్‌డేట్ రేపు మధ్యాహన్నం 2 గంటలకు ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.



Advertisement

Next Story