#VD13 నుంచి సాలిడ్ అప్ డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

by Anjali |   ( Updated:2023-09-27 08:20:32.0  )
#VD13 నుంచి సాలిడ్ అప్ డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: ‘గీతా గోవిందం’ ఫేమ్‌ పరుశురాం పెట్ల, విజయ్‌ దేవరకొండ కాంబోలో మరో మూవీ ‘VD13’ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ షెడ్యూల్స్‌తో బిజీగా నడుస్తుండగా తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్‌. ఈ మేరకు సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లు ఓ ప్రీ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘#VD13 #SVC54 50% షూటింగ్ పూర్తైంది. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ త్వరలో. 2024 సంక్రాంతికి విడుదల’ అంటూ అనౌన్స్ చేశారు.

ఇక మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండగా ‘గీతాగోవిందం’ కాంబో కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలావుంటే.. ఇప్పటికే సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో సహా కొన్ని సినిమాలు ఆరు నెలల ముందే స్లాట్‌ను బుక్‌ చేసుకోగా ఇప్పుడు విజయ్ మూవీ ఈ లిస్టులో చేరడంతో రసవత్తరమైన పోరు తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement

Next Story