- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varuntej- Lavanya Tripati: మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మరో వారసుడు వస్తున్నాడోచ్..? ఫొటోలు వైరల్
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠిల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి మెగా కోడలి స్టేటస్‌ను లావణ్య త్రిపాఠి బాగా ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ విజయం కోసం తాపత్రయ పడుతున్నాడు. కానీ, హిట్ మాత్రం కొట్టలేక పోతున్నాడు. ప్రజెంట్ ‘మట్కా’ మూవీ షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక లావణ్య విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. కానీ, ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రకటించకుండా సైలెంట్‌గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ అడపాదడపా పోస్టులు పెడుతుంది. వరుణ్‌కు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తూ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా వరుణ్- లావణ్య శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో లావణ్య బేబీ బంప్‌తో ఉన్నట్టుగా కనిపించింది. పొట్ట కనిపించకుండా మొత్తం చీర చుట్టుకుంది. దీంతో అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. బేబీ బంప్స్ ఫొటో కనిపించకుండా లావణ్య త్రిపాఠి చాలా జాగ్రత్త పడుతోంది అని.. లావణ్య శారీతో కవర్ చేసుకున్నటువంటి ఈ పద్ధతి వల్ల త్వరలో మెగా ఫ్యామిలీకి వారసుడిని ఇవ్వబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గడిచిన నెల నుంచి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు దీంతో ఈ పుకారుకు ఆజ్యం పోసినట్లయింది. ఆమె ప్రగ్నెంట్ కావడం వల్లనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా లేదని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.