అలా కలవడంతోనే ప్రేమించుకున్నామంటూ లావణ్యతో లవ్‌పై వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

by Hamsa |   ( Updated:2023-08-17 07:51:53.0  )
అలా కలవడంతోనే ప్రేమించుకున్నామంటూ లావణ్యతో లవ్‌పై వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’ సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ లో చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది.

ఈ క్రమంలో వరుణ్ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా లావణ్యతో తన లవ్‌స్టోరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ మా లవ్ స్టార్ట్ అయి ఐదేళ్లు అయిపోయింది. ఇద్దరం మంచి స్నేహితులుగా చాలా కాలం ఉన్నాము. అభిరుచులు, అభిప్రాయలు కలవడంతోనే మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాము. నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో లావణ్య త్రిపాఠి ఒకరు. ముందు నేను ఆమెకు ప్రపోజ్ చేశాను. దానికి ఆమె ఒకే చెప్పింది. తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు చెప్తే వారు కూడా ఒప్పుకున్నారు. మా నిర్ణయాన్ని గౌరవించి అంగీకరించారు. లావణ్య నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది. నేను వాడుతున్న ఫోన్ ఆమెనే ఇచ్చింది. నాకు ఏది ఇష్టమో లావణ్యకు బాగా ఇష్టం. చాలా మెచ్చూర్డ్‌గా ఆలోచిస్తుంది. మా ప్రేమ విషయం ఇన్నాళ్లు దాచిపెట్టడానికి కారణం కొన్ని విషయాలను పర్సనల్‌గా ఉంచడానికే నేను ఇష్టపడతాను అందుకే ఇన్నాళ్లు చెప్పలేదు. ఎంగేజ్‌మెంట్ మాదిరిగానే పెళ్లి కూడా సింపుల్‌గా చేసుకుంటాము’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More :

విజయ్‌కి కాబోయే భార్య అలా ఉండాలి అంటూ సమంత కామెంట్స్

ఎంత ప్రేమించినా సరిపోదు అంటూ విజయ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన సమంత.. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కామెంట్స్

Advertisement

Next Story