లావణ్య కోసం మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చేలా వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం

by Anjali |   ( Updated:2023-10-18 05:28:11.0  )
లావణ్య కోసం మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చేలా వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్ తన సొంత ఖర్చుతో పెళ్లి చేసుకోబోతున్నడని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంలో నాగబాబుకు, పెద్దనాన్న చిరంజీవికి ఏ మాత్రం చాన్స్ ఇవ్వట్లేదట. ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి.. పెళ్లి ఖర్చు కూడా తనే భరించాలనుకుంటున్నాడట వరుణ్. అలాగే ఫ్యామిలీ సభ్యులందర్ని కూడా సొంత ఖర్చుతో ఇటలీకి తీసుకెళ్తున్నాడ. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక ఇటలీలో టస్కానీలోని బార్గో శాన్ ఫెలిస్ అనే రిసార్ట్‌లో నవంబరు 1వ తేదీన వీరిద్దరు ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నారు.

Advertisement

Next Story