- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోతున్న వరుణ్ తేజ్-లావణ్య వెడ్డింగ్ కార్డ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ కల్యాణ్ నేమ్!
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి గత ఐదేండ్ల నుంచి గుట్టుచప్పుడు లేకుండా ప్రేమాయణం నడిపి.. జూన్‌లో హైదరాబాదులోని నాగబాబు నివాసంలో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇక నవంబరు 1వ తారీకున వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. వరుణ్-లావణ్య ప్రేమ చిగురించిన చోటే (ఇటలీ)వీరి వివాహం జరగబోతుంది. కాగా వీరి పెళ్ళికి సంబంధించిన పనులు ఇప్పటికే చకచకా జరిగిపోతున్నాయి. పెళ్లి ఇటలీలో కావడంతో మెగా ఫ్యామిలీ, అటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ పనులన్నీ తొందరగా పూర్తి చేసుకుంటున్నారు.
అయితే నవంబరు 1వ తేదీన ఇటలీలో పెళ్లి జరగనుండగా.. నవంబరు 5న హైదరాబాదులో ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ మేరకు రిసెప్షన్ తేదీ, వెన్యూ కూడా ఫిక్స్ అయ్యాయి. కాగా, వెడ్డింగ్ కార్డు ఫ్రంట్‌లో వరుణ్, లావణ్య పేర్లలోని ‘V, L’ అక్షరాలతో లోగో డిజైన్ చేశారు. ఇక లోపల పై భాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకట్రావు ఆశీస్సులతో అని ముద్రించారు. ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం అని.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాం చరణ్ పేర్లని హైలైట్ చేశారు. శుభలేక ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోతుందంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట చర్చ మొదలుపెట్టారు.