చైల్డ్ ఆర్టిస్ట్‌గా వరుణ్ తేజ్.. మొదటి సినిమా ఏంటంటే..!

by sudharani |   ( Updated:2024-02-28 15:07:42.0  )
చైల్డ్ ఆర్టిస్ట్‌గా వరుణ్ తేజ్.. మొదటి సినిమా ఏంటంటే..!
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఐదేళ్ల క్రితం పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాదులపై తీర్చుకున్న రివెంజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక మార్చి 1న ఈ చిత్రం థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా చేస్తు్న్నారు చిత్రం బృందం. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ, అంత కంటే ముందే చైల్ట్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడని ఎవరికైనా తెలుసా. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ మూవీ పేరు ‘చేతులు పైకెత్తు’. జయసుధ రాసిన ఈ కథను దర్శకుడు శివ నాగేశ్వర రావు తెరకెక్కించాడు. ఈ చిత్రం 2000లో విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి, జయసుధ హీరోహీరోయిన్లు కాగా.. నాగబాబు, బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో వరుణ్ తేజ్ ఉంటాడు. అది చాలా తక్కువ సమయమే కనిపిస్తాడు. తర్వాత ఏ సినిమాలో కూడా వరుణ్ కనిపించలేదు. డైరెక్ట్‌గా హీరోగా ‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. అందుకే వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ సినిమా చేసిన విషయం అంతగా ఎవరికి తెలియదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఈ వార్త ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చింది.

Read More..

మహేష్‌ బాబు యాడ్స్‌, చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పిన బజర్దస్త్ కమెడియన్ ఇతడే?

Advertisement

Next Story