Hero Varun Sandesh: ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Prasanna |   ( Updated:2024-08-21 12:18:45.0  )
Hero Varun Sandesh: ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా : ఒకప్పుడు హీరో వరుణ్ సందేశ్ సినిమా వస్తుందంటే చాలు.. సినీ లవర్స్ రెండు, మూడు రోజుల ముందు నుంచే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకునే వారు. అయితే, కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరో బిగ్ బాస్ తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చాడు.

‘నింద’ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ .. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత విరాజి అంటూ కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చాడు ఈ హీరో. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రమోదిని, రఘు కారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆగస్టు 02న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీకి కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆండీ పాత్రలో నటించి అందర్ని మెప్పించాడు వరుణ్ సందేశ్. మరో రెండు రోజుల్లో ఓటీటీలో సందడీ చేయనుంది.

థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన విరాజి మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 22 నుంచి విరాజి మూవీ మనకు అందుబాటులోకి రానుంది. నీ చుట్టూ పిచ్చి ప్రపంచం.. బయటపడతాడా? భయపెడతాడా?’ అంటూ అదిరిపోయే క్యాప్షన్ తో ఆహా అధికారిక ప్రకటనతో పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed