- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Utsavam Movie Update: ఉత్సవం అప్డేట్.. ఆకట్టుకుంటున్న మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్
దిశ, సినిమా: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం'ఉత్సవం'. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్ బిల్ పిక్చర్స్ పతాకంపై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న మూవీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటను దిలీప్ ప్రకాష్, రెజీనాపై చిత్రీకరించారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ అర్మాన్ మాలిక్ ఆలపించాడు.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ.. 'ఈ పాటను అనూప్ ఓ బ్యూటీఫుల్ సిగ్నేచర్ మెలోడిగా కంపోజ్ చేశారు. ట్యూన్ విన్న వెంటనే అందరికి క్యాచీగా అనిపిస్తుంది. ఈ పాట సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్‌గా ఉంటుంది. సినిమా కూడా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.