హీరోయిన్ పాత్రలపై ఊర్వశీ షాకింగ్ కామెంట్స్.. టైమ్ వేస్ట్ వ్యవహారమంటూ

by Hamsa |   ( Updated:2023-10-21 07:11:59.0  )
హీరోయిన్ పాత్రలపై ఊర్వశీ షాకింగ్ కామెంట్స్.. టైమ్ వేస్ట్ వ్యవహారమంటూ
X

దిశ, సినిమా: హీరోయిన్‌గా నటించడంకంటే ఐటెం సాంగ్స్ చేసుకోవడమే హాయిగా ఉందంటోంది బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి మాట్లాడుతూ.. ‘ఇటీవల నాకు హీరోయిన్‌గా చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు వాటిపై ఆసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్‌ హీరోల సరసన ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తున్న నేను.. హీరోయిన్‌గా చిన్న హీరోలతో నటించలేను.

గుర్తింపులేని దర్శకులతో పనిచేయాలంటే భయమేస్తుంది. ఆ సినిమాలు ఫెయిల్ అయితే నా కెరీర్‌ దెబ్బతింటుంది. అందుకే రిస్క్ చేయలేను. స్టార్ హీరోలతో చేసే ఐటమ్ సాంగ్ షూటింగ్‌ ఒక్క రోజులో కంప్లీట్ అవుతుంది. అందుకు సరిపడ పారితోషికం కూడా అందుతుంది. ఇంకెందుకు నాకు హీరోయిన్‌ పాత్రలు’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Advertisement

Next Story