గులాబీ రంగు గౌనులో మైమరపించిన ఊర్వశి.. విశ్వానికే అందగత్తెవంటున్న ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2023-05-17 09:15:00.0  )
గులాబీ రంగు గౌనులో మైమరపించిన ఊర్వశి.. విశ్వానికే అందగత్తెవంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. ప్రస్తుతం జరుగుతున్న ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ప్రత్యేకమైన వేషాధారణలో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. బుధవారం ఉదయం మొదలైన ఈ 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో తన మొదటి ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేయగా.. గులాబీ రంగు గౌనులో వేదికపై హొయలు పోయింది. అంతేకాదు మెడలో బంగారు బల్లి నెక్లెస్‌ ధరించిన హాటీ.. దానికి సరిపోలే చెవిపోగులు పెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక విభిన్న యాంగిల్స్‌‌లో ఫొటోలకు పోజులిస్తూ అభిమానులను అలరించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఈ విశ్వంలో అత్యంత అందమైన స్త్రీ నువ్వే. మై క్వీన్’, ‘నిన్ను ఇలా చూస్తే అప్పుడప్పుడు న్యూడ్ లుక్స్‌లో కనిపించే ఊర్వశి నువ్వు కాదనిపిస్తోంది’ అంటూ పొగిడేస్తున్నారు.

Also Read: ఆ కష్టాలు పడలేక నగ్నంగా నటించాలని కోరిన తల్లి.. తట్టుకోలేకపోయానన్న మిస్ ఇండియా

Advertisement

Next Story