‘ఐకానిక్ పీస్’.. క్రొకడైల్‌ నెక్లెస్‌పై ట్రోలింగ్‌ను తిప్పికొట్టిన ఊర్వశి

by Anjali |   ( Updated:2023-05-21 08:15:04.0  )
‘ఐకానిక్ పీస్’.. క్రొకడైల్‌ నెక్లెస్‌పై ట్రోలింగ్‌ను తిప్పికొట్టిన ఊర్వశి
X

దిశ, సినిమా: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2023లో భాగంగా మొసలి ఆకారపు నెక్లెస్ ధరించినందుకుగానూ తనపై వస్తున్న విమర్శలను ఊర్వశి రౌతేలా తిప్పికొట్టింది. గత వారం రోజులుగా జరిగిన ఈ వేడుకలో విభిన్న వేషాధారణలో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసిన ఊర్వశి.. మొదటిరోజు గులాబి కలర్ పెద్ద గౌనులో మైమరపించింది. అయితే తాను మెడలో వేసుకున్న గొల్డ్ కలర్ క్రొకడైల్‌ నెక్లెస్ హాట్ టాపిక్‌గా మారగా.. కొంతమంది దీన్ని ట్రోలింగ్ చేశారు. అయితే తాజాగా తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన నటి.. ‘సరైన సమాచారం లేని వ్యక్తులు.. నాపై వింత వ్యాఖ్యలు రాస్తున్నారు. నిజానికి ఇదొక ‘ఐకానిక్ పీస్’’ అంటూ తనను తాను పొగిడేసుకుంది. అలాగే 2006 కేన్స్‌లో మోనికా బెల్లూచి కూడా ఇదే నెక్లెస్ ధరించిన విషయం తెలిసినప్పటికీ దాని గురించిన పూర్తి అవగాహన తనకు లేదని చెప్పింది.

Also Read...

ఆ సినిమా హిట్ అయినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు: కరిష్మా

Advertisement

Next Story

Most Viewed