Urvashi Rautela Says "I'm Sorry" To Rishabh Pant

by sudharani |   ( Updated:2023-03-24 15:40:31.0  )
Urvashi Rautela  Says Im Sorry To Rishabh Pant
X

దిశ, సినిమా : క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్ గురించి ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా.. 'అక్కా నన్ను వదిలేయ్' అంటూ రిషబ్ నుంచి ఘాటు విమర్శలే ఎదుర్కొంది. ఇక ఆసియా కప్‌ టైమ్‌లోనూ ఈ బ్యూటీ గురించి భారీగా ట్రోల్ చేశారు రిషబ్ ఫ్యాన్స్. ఇప్పటికీ ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన వార్ కొనసాగుతుండగా.. వీటన్నింటికీ ఎండ్ చెప్పాలంటూ సింపుల్‌గా క్షమాపణలు చెప్పేసింది ఊర్వశి. పాజిటివ్ అట్మాస్పియర్, పాజిటివ్ వైబ్ కోరుకునే తను ఇలాంటి వాతావరణం తట్టుకోలేకపోతున్నానని, తనను వదిలేయాలంటూ చేతులు జోడించి మరీ సారీ చెప్పింది. కాగా ఈ అపాలజీని ఎక్స్‌పెక్ట్ చేయని నెటిజన్స్.. 'ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఏమైనా జరిగిందా?' అని ప్రశ్నించుకుంటున్నారు.

Advertisement

Next Story