Urfi Javed: ఉర్ఫీ జావేద్ కు సైబర్ రేప్ చేయమని బ్లాక్ మెయిల్..

by srinivas |   ( Updated:2022-08-15 06:40:42.0  )
Urfi Javed Shares a pic of a man who harassed her
X

దిశ,వెబ్‌డెస్క్: Urfi Javed Shares a pic of a man who harassed her| ఉర్పీ జావేద్ డిఫరెంట్ ప్యాషన్ తో తన అందాలను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తుంటుంది. ఈ సారి అలా చేయలేదు ఉర్ఫీ జావేద్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక వ్యక్తి నుండి వేధింపులను ఎదుర్కోవడంపై షాకింగ్ కథనాన్ని పంచుకున్నారు. ఉర్ఫీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకుని, చాట్ సందేశాల నుండి స్క్రీన్‌షాట్‌లతో పాటు ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేసింది. తనను బ్లాక్ మెయిల్ చేయడం తో పాటు డబ్బులు కూడా అడిగాడు అని ఆరోపణలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆ వ్యక్తి రెండేళ్లుగా తనను వేధిస్తున్నాడని, ముంబై పోలీసులకు గత 14 రోజుల క్రితం ఆమె ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

ఉర్పీ జావేద్ తన ఇన్‌స్టా క్యాప్షన్ లో ఇలా రాసింది '' 2 సంవత్సరాల క్రితం ఎవరో నా ఫోటోలు మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్నట్లు గా పోలీసులకు ఫిర్యాదు చేశాను ఆ సమయంలో నరకం అనుభవించాను అని రాసింది. అతనితో వీడియో సెక్స్ చేయమని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, లేకుంటే అతను నా ఫోటోలను వివిధ బాలీవుడ్ పేజీలలో షేర్ చేసి నా కెరీర్‌ను నాశనం చేస్తా అని అంటున్నాడు. 1వ తేదీన గోరేగావ్ పోలీస్ స్టేషన్ ముంబై పోలీసులు F.I.R దాఖలు చేశారు. 14 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను చాలా నిరాశకు గురయ్యాను. ముంబై పోలీసులు గురించి మంచిగా విన్నా కానీ ఈ వ్యక్తి పట్ల వీరి వైఖరి విచిత్రంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఎంతో మంది మహిళలపై సైబర్ రేప్ చేయమని వేదించాడు అని చెప్పినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదని ఏమైనా ఈ మనిషి సమాజానికి , మహిళలకు ముప్పు . అతన్ని స్వేచ్ఛగా బతకనివ్వకూడదు.. ఎంత మంది మహిళలతో చేశాడని వారికి తెలియజేసినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏది ఏమైనా ఈ మనిషి సమాజానికి , మహిళలకు ముప్పు . అతన్ని స్వేచ్ఛగా బతకనివ్వకూడదు.. ఇప్పుడు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో కానీ పంజాబ్ పరిశ్రమలో స్వేచ్ఛగా పనిచేస్తున్న ఈ వ్యక్తి గురించి అందరికీ చెప్పాలనుకున్నాను '' ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆ వ్యక్తి పోటో తో పాటు పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: 'పుష్ప2లో' విలన్ గా విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇచ్చిన పీఆర్‌వో

Advertisement

Next Story