వాటిని పెద్దగా చేయించుకోవాలని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఉర్ఫీ.. వైద్యం వికటించడంతో

by Hamsa |   ( Updated:2023-07-24 10:43:14.0  )
వాటిని పెద్దగా చేయించుకోవాలని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఉర్ఫీ.. వైద్యం వికటించడంతో
X

దిశ, వెబ్ డెస్క్: ఉర్ఫీ జావెద్ పేరుకు సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు వింత వింత డ్రెస్సులతో దర్శనమిస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. అంతేకాకుండా తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగానే సమాధానమిస్తుంది.

తాజాగా, ఉర్ఫీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా పెదవి కోసం నేను చేయించుకున్న వైద్యం, ప్రయోగాల ప్రయాణాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.. నేను 18 సంవత్సరాల వయస్సు నుండి లిప్ ఫిల్లర్‌లను వాడుతున్నాను. అప్పటికి నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ నా పెదాలు చాలా సన్నగా ఉన్నాయని.. వాటిని పెద్దగా చేయించుకోవాలని అనుకున్నాను. నేను డాక్టర్ వద్దకు వెళ్లాను. తక్కువ ఖర్చుతోనే సెట్ చేస్తామని అన్నారు. అప్పుడు కొన్నిసార్లు మంచి ఫలితాలనే ఇచ్చింది. అయితే కొంత కాలానికి నేను వాటిని ఆపేశాను.

అది చాలా ప్రమాదం, బాధాకరమైన వైద్యం. ఇలా చేయించుకోవద్దని నేను ప్రజలకు చెప్పలేను కానీ, ఫిల్లర్లు లేదా బొటాక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నా ఫేస్‌కి ఏది సెట్ అవుతుందో నాకు తెలుసు. ఇప్పుడు తక్కువ, ఎక్కువ అనేది నాకు తెలుసు. అయినా ఎవరైనా సరే డాక్టర్ వద్దకు వెళ్లేటప్పుడు, చికిత్స తీసుకోవాలని అనుకున్నప్పుడు అన్నీ తెలుసుకుని రీసెర్చ్ చేసి వెళ్లండి. మీరు మీ మొహం పట్ల సరిగ్గా అభద్రతాభావం ఉంటే మిమ్మల్ని మీరు ద్వేషించుకునే బదులు ఫిల్లర్లు లేదా సర్జరీలను ఎంచుకోవడం మంచిదని, ఫిల్లర్లను వాడమని చెబుతాను. కానీ, చాలా మంచి వైద్యుడి ఎంచుకుని మంచి వైద్యం చేసే వారి వద్దనే చేయించుకోమని చెప్తాను’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Read More: విడాకుల రూమర్స్.. బుర్ఖా వేసుకుని తిరుగుతున్న కలర్ Swathi (వీడియో)

Advertisement

Next Story